చాక్లెట్ వినాయకుడు!

వినాయకచవితి అంటే మట్టితో చేసిన గణేషునికి పూజలు చేసి నీటిలో నిమజ్జనం చేస్తారు. కానీ, ముంబైకి చెందిన ఇతను మాత్రం చాక్లెట్‌తో వినాయకుడిని చేసి పేదపిల్లలకు పంచి పెట్టాడు.

వినాయకచవితి అంటే కులం, మతం అనే భేదం లేకుండా అందరూ జరుపుకునే పండుగ. అయితే, ఈ మధ్యకాలంలో ఎన్నో కెమికల్స్ కలిగిన ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో వినాయకుడ్ని చేసి, నీటిలో నిమజ్జనం చేస్తున్నారు. దీని ద్వారా నీరు కలుషితమై జీవావరణం దెబ్బతింటున్నది. ఇలాంటి సమస్యకు పరిష్కారంగా.. పంజాబ్‌కు చెందిన హర్జిందర్ సింగ్ భిన్నంగా ఆలోచించాడు. బేకరీ నడుపుకునే ఈయన తాను తయారు చేసే చాక్లెట్‌తోనే ఓ వినాయక విగ్రహాన్ని చేయాలనుకున్నాడు. 65 కిలోల చాక్లెట్‌ను ఉపయోగించి ఇరవై మంది పనివాళ్లతో పది రోజుల్లో విగ్రహాన్ని పూర్తి చేసి, ఈ నవరాత్రుల్లో పూజలు జరుపుతున్నాడు. అందరిలాగా నిమజ్జనం రోజు నీటిలో వేయకుండా పాలలో ఈ వినాయకుడిని వేస్తారు. పాలలో కరిగిన వినాయకుడిని మిల్క్‌షేక్‌గా పేదపిల్లలకు పంచి పెడతాడు. ఇలా మూడు సంవత్సరాల నుంచి ఈ పద్ధతిని పాటిస్తున్నాడు హర్జిందర్ సింగ్. పుట్టింది సిక్కుల కుటుంబంలో అయిన వినాయకచవితిని ఇలా ఘనంగా జరుపుకుంటున్నాడు.