కర్బూజాతో ముఖ సౌందర్యం!

-కర్బూజా గుజ్జు, తేనె రెండింటినీ బాగా కలుపాలి. ఈ మిశ్రమాన్ని మెడ, ముఖానికి రాయాలి. 15 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే చర్మం కాంతివంతంగా మారుతుంది. -ఓట్‌మీల్, కర్బుజా గుజ్జు, కొంచెం పసుపు వేసి కలుపాలి. ఈ మిశ్రమాన్ని వేళ్లతో ముఖానికి ఐదు నిమిషాల పాటు మర్దన చేయాలి. 20 నిమిషాల తరువాత నీటితో కడుగాలి. తరుచూ ఇలా చేస్తే నల్లమచ్చలు తొలుగుతాయి. -కర్బూజా, పీచ్‌లను గుజ్జులా చేయాలి. ఈ మిశ్రమాన్ని శుభ్రం చేసిన మెడ, ముఖానికి రాయాలి. 15 నిమిషాల తరువాత నీటితో కడుగాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే చర్మం అందంగా ఉంటుంది. -పాలపొడి, కర్బూజా గుజ్జు రెండింటినీ కలుపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాయాలి. 20 నిమిషాల తరువాత నీటితో కడుగాలి. తరుచూ ఇలా చేస్తే చర్మం మృదువుగా మారుతుంది.