చలికాలంలో శుభ్రంగా..

-కారు లోపల ఉండే డ్యాష్ బోర్డును తప్పనిసరిగా వారానికోసారి తుడుచుకోవాలి. లేదంటే దుమ్ము, ధూళి ఉండి మరింతగా బ్యాక్టీరియా పెరుగుతుంది. -పిల్లలు కారులో కూర్చున్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో ఒకటి సీట్లను శుభ్రంగా ఉంచుకోవడం. -టీవీ రిమోట్ కంట్రోల్, బ్యాగు, పర్సు వంటి వాటిని తరుచుగా వినియోగిస్తుంటాం.కాబట్టి వాటిని ఎప్పటికప్పుడు క్లీన్‌గా ఉంచాలి. -మొబైల్ ఫోన్, ఆఫీస్‌లో గానీ ఇంట్లో గానీ ప్రతి రోజూ వాడే కంప్యూటర్ కీ బోర్డు, మౌస్‌లను శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా అలర్జీలకు దూరంగా ఉండవచ్చు. -చలికాలంలో రిఫ్రిజ్‌రేటర్‌ను పలుమార్లు ఉపయోగిస్తాం. ఆ సమయంలో చేతులకు ఉండే బ్యాక్టీరియా వైరస్‌గా మారక ముందే క్రిమి సంహారక మందులతో క్లీన్ చేయాలి.