మలేషియా డాన్‌గా..

విక్రమ్ సక్సెస్‌ను అందుకొని చాలా కాలమే అయ్యింది. సామిస్క్వేర్‌తో పాటు గత చిత్రాలన్నీ ఆయనకు నిరాశనే మిగిల్చాయి. ప్రస్తుతం హీరో కమల్‌హాసన్ నిర్మిస్తున్న యాక్షన్ థ్రిల్లర్‌లో విక్రమ్ కథానాయకుడిగా నటిస్తున్నారు. తూంగవనం ఫేమ్ రాజేష్ ఎం. సెల్వ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కడరం కొండన్ అనే పేరును ఖరారుచేశారు. విక్రమ్ ఫస్ట్‌లుక్‌ను ఇటీవలే కమల్‌హాసన్ ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. ఈ ఫస్ట్‌లుక్‌లో చేతులకు సంకేళ్లతో ఒంటిపై విచిత్రమైన టాట్టూలతో సాల్ట్‌పెప్పర్‌లుక్‌లో విక్రమ్ వినూత్నంగా కనిపిస్తున్నారు. మలేషియా నేపథ్యంలో ఈ సినిమా సాగనున్నట్లు తెలిసింది. డాన్ పాత్రలో విక్రమ్ కనిపించబోతున్నట్లు సమాచారం. అక్షర హాసన్ కథానాయికగా నటిస్తున్నది.