మేల్కొలుపు

పంచాననాబ్జభవ షణ్ముఖ వాసవాద్యా: త్రైవిక్రమాది చరితం విబుధా: స్తువంతి భాషాపతి: పఠతి వాసరశుద్ధి మారాత్ శేషాద్రి శేఖరవిభో తవ సుప్రభాతమ్ ॥ 6॥

- శ్రీ వేంకటేశ్వర సుప్రభాతమ్

అయిదు ముఖాలతో కూడిన పరమేశ్వరుడు, పద్మంలో జన్మించిన బ్రహ్మదేవుడు, ఆరు ముఖాలు కలిగిన కుమారస్వామి, దేవేంద్రుడు తదితర దేవతామూర్తులందరూ త్రివిక్రమ అవతారం (వామనావతారం) తో కూడిన నీ చరితను స్తోత్రం చేస్తున్నారు. భాషాధిపతి అయిన బృహస్పతి తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలతో పంచాంగ శ్రవణం చేస్తున్నాడు. శేషాద్రి పర్వత శిఖరాన్ని ఏలుతున్న శ్రీ వేంకట చలపతీ..అందుకొనుమా మా సుప్రభాతం.