జనవరికి మిస్టర్ మజ్ను

అఖిల్ అక్కినేని కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం మిస్టర్ మజ్ను. వెంకీ అట్లూరి దర్శకుడు. నిధి అగర్వాల్ కథానాయిక. శ్రీవెంకటేశ్వర సినీచిత్ర పతాకంపై బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మిస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ ప్రస్తుతం చిత్రీకరణ దశలో వుంది. ఇదొక యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్. అఖిల్‌ని కొత్త కోణంలో ఆవిష్కరిస్తున్నాం. ప్లేబాయ్ తరహా పాత్రలో అఖిల్ నటిస్తున్నాడు. ఆయన పాత్ర చిత్రణ నవ్య పంథాలో సాగుతుంది. వినోదానికి పెద్దపీట వేశాం. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి చిత్రాన్ని జనవరికి ప్రేక్షకల ముందుకు తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నాం. తప్పకుండా ఆకట్టుకుంటుందనే నమ్మకముంది అన్నారు. నాగబాబు, ప్రియదర్శి, జయప్రకాష్, హైపర్ ఆది తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్, పాటలు: శ్రీమణి, ఛాయాగ్రహణం: జార్జ్ సి.విలియమ్స్, ఎడిటింగ్: నవీన్ నూలి, ఆర్ట్: అవినాష్ కొల్ల, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వెంకీ అట్లూరి.