సీడీఎఫ్‌డీలో రిసెర్చ్

హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ డిఎన్‌ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నస్టిక్స్ (సీడీఎఫ్‌డీ) వివిధ శాస్ర్తాల్లో పరిశోధన చేయడానికి రిసెర్చ్ స్కాలర్ ప్రోగ్రాం-II కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
-కోర్సు పేరు: రిసెర్చ్ స్కాలర్ ప్రోగ్రాం-II -అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మాస్టర్ డిగ్రీ (సైన్స్, టెక్నాలజీ/అగ్రికల్చర్)లో ఉత్తీర్ణత. ఫైనల్‌ఇయర్ చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. సీఎస్‌ఐఆర్/యూజీసీ లేదా డీబీటీ/ ఐసీఎంఆర్ ఇన్‌స్పైర్ నెట్ జేఆర్‌ఎఫ్ లేదా జెస్ట్‌లో ఉత్తీర్ణత. -అప్లికేషన్ ఫీజు: జనరల్ అభ్యర్థులు-రూ.500/-, ఓబీసీ అభ్యర్థులు-రూ.250/-, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, మహిళ అభ్యర్థులకు రూ.125/- -ఎంపిక విధానం: రాతపరీక్ష/ సీడీఎఫ్‌డీ ల్యాన్ బేస్డ్ ఎగ్జామ్, ఇంటర్వూ -దరఖాస్తు: ఆన్‌లైన్‌లో -దరఖాస్తులకు చివరితేదీ: డిసెంబర్ 17 -సీడీఎఫ్‌డీ ల్యాన్ బేస్డ్ ఎగ్జామ్: 2019 జనవరి 21 -ఇంటర్వ్యూ తేదీ: 2019 జనవరి 22 -వెబ్‌సైట్: www.cdfd.org.in