పొడిబారుతున్న చర్మానికి!

చలికాలం వచ్చిందంటే చర్మం పొడిబారడం, ఎర్రబడడంలాంటి సమస్యలతో బాధపడుతుంటారు. వీటి నుంచి చర్మాన్ని కాపాడుకునేందుకు ఈ కింది చిట్కాలు పాటించండి.
-తేనె, పాలు రెండింటినీ కలుపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత నీటితో శుభ్రపరుచాలి. ప్రతిరోజూ ఇలా చేస్తే చర్మం పొడిబారదు. -అరటి గుజ్జులో కొంచెం పెరుగు, తేనె వేసి బాగా కలుపాలి. ఈ మిశ్రమాన్ని మెడ, ముఖానికి రాయాలి. 15 నిమిషాల తరువాత నీటితో శుభ్రపరుచాలి. తరుచూ ఇలా చేస్తే చర్మం మృదువుగా మారుతుంది. -ఓట్‌మీల్ పౌడర్, పెరుగు, తేనె మూడింటినీ కలుపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాయాలి. 20 నిమిషాల తరువాత నీటితో కడుగాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే చర్మానికి మాయిశ్చరైజర్ అందుతుంది. -స్ట్రాబెర్రీ, నిమ్మరసం, తేనెలను బాగా కలుపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాయాలి. 30 నిమిషాల తరువాత శుభ్రపరుచుకోవాలి. తరుచూ ఇలా చేస్తే చర్మం పగులకుండా ఉంటుంది. -తేనె, పండు అవకాడో, గుడ్డు పచ్చసొన వేసి కలుపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాయాలి. 30 నిమిషాల తరువాత నీటితో కడుగాలి. వారానికి ఒకసారి ఇలా చేస్తే చర్మం పొడిబారకుండా ఉంటుంది.