కొనుగోలుదారుల్లో పెరిగిన విశ్వాసం

బీటీఆర్ గ్రీన్స్ మూడో ఫేజు ఆరంభించిన ఏడాదిలోపు డెబ్బయ్ శాతం అమ్మకాలు పూర్తయ్యాయి.. మరో మూడు నుంచి నాలుగు నెలల్లోపు మిగతావి పూర్తవుతాయని మ్యాక్ ప్రాజెక్ట్స్ ఎండీ నాసిర్ అలీ ఖాన్ తెలిపారు. ఎన్నికల సమయంలో అమ్మకాలు తగ్గముఖం పట్టడం సహజంగా హైదరాబాద్‌లో ఉండేది. కానీ, ఈసారి అలాంటి ఇబ్బందులేం లేవు. ప్రస్తుత ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందన్న అంచనాలున్న నేపథ్యంలో.. కొనుగోలుదారులు ఇండ్లను కొనుగోలు చేస్తున్నారని అన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..

హైదరాబాద్లో శాంతిభద్రతలు మెరుగ్గా ఉండటంతో ఇండ్ల కొనుగోలుదారులకు ఎక్కడ్లేని భరోసా కలిగింది. పెట్టుబడిదారులు పూర్తిస్థాయి విశ్వాసం కలిగి ఉన్నారు. దేశవ్యాప్తంగా చూస్తే.. ప్రజలు నిశ్చింతంగా, సురక్షితంగా ఉన్న నగరం ఏదైనా ఉందా అంటే.. అది కచ్చితంగా భాగ్యనగరమే అని ఘంటాపథంగా చెప్పొచ్చు. కొనేవారిలో విశ్వాసం కలిగించే ప్రతి చర్య వల్ల మార్కెట్‌లో గిరాకీ పెరుగుతుంది. ఫలితంగా, అమ్మకాలూ అధికమవుతాయి. టైటిల్ ఇన్సూరెన్స్ వల్ల తెలంగాణ నిర్మాణ రంగానికి పెద్దగా నష్టం వాటిల్లుతుందని భావించడం లేదు. కొనుగోలుదారులకు మేలు కలిగించే ప్రతి చర్యను మేం సమర్థిస్తాం.

-రెరా రాక ముందు నుంచే హైదరాబాద్‌లో అధిక శాతం కంపెనీలు నిర్మాణ నిబంధనల్ని కచ్చితంగా పాటిస్తున్నాయి. స్థానిక సంస్థల నుంచి అనుమతి తీసుకున్నాకే ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నాయి. కొనుగోలుదారులకు చెప్పినవాటి కంటే అధిక స్థాయి సదుపాయాల్ని అందజేస్తున్నాయి. మౌలిక సదుపాయాలు పది శాతం ఉండాలంటే.. పదిహేను శాతం ఇచ్చేవారున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తూ స్థానిక అవసరాలకు తగ్గట్టుగా నిర్మాణాల్ని చేపట్టే సంస్థలు చాలా ఉన్నాయి. అందుకే, దేశంలోకెల్లా మన హైదరాబాద్‌లో అమ్మకాలు మెరుగ్గా జరుగుతున్నాయి. అన్ని మెట్రో నగరాల్లోకెల్లా మన వద్ద కొనుగోలుదారులు ఆనందంగా ఫ్లాట్లను కొనుగోలు చేస్తున్నారు.

-విమానాశ్రయం చేరువలోని శ్రీశైలం రోడ్డులో 250 ఎకరాల్లో బీటీఆర్ గ్రీన్స్ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తున్నాం. ఇందులో ఇప్పటికే రెండు దశల్లో 120 ఎకరాల్లో విల్లాలు, వ్యక్తిగత గృహాలను అభివృద్ధి చేశాం. ప్రత్యేకంగా గోల్ఫ్ కోర్సును ఏర్పాటు చేశాం. ఇక, మూడో విడతలో భాగంగా 114 ఎకరాల్లో కొనుగోలుదారుల అభిరుచి మేరకు వ్యక్తిగత ఇండ్లను కట్టుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాం. మహిళల కోసం ప్రత్యేకంగా స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేస్తున్నాం. క్రికెట్ గ్రౌండ్, ఇండోర్ స్టేడియం వంటి వాటికి పెద్దపీట వేశాం. మేమెక్కడ ప్రాజెక్టును ప్రారంభించినా ముందుగా మౌలిక సదుపాయాల్ని అభివృద్ధి చేస్తాం. ఆతర్వాతే ప్రాజెక్టును చేపడతాం. అప్పుడే, కొన్నవారికీ ఎలాంటి ఇబ్బందులుండవు. 500 వ్యక్తిగత గృహాల సముదాయాన్ని ప్రారంభించాం. ఇందులో ప్లాటు కొనుగోలు చేసుకుంటే.. ఎవరికి నచ్చినట్లుగా వారు తమ కలల గృహాన్ని కట్టుకోవచ్చు. హైదరాబాద్‌లో ప్రస్తుతం ధర మెరుగ్గా ఉంది. అమ్మకాలూ ఊహించిన దానికంటే ఎక్కువే జరుగుతున్నాయి. ఇదే పోకడ రానున్న రోజుల్లోనూ కొనసాగుతుంది.