ైస్టెల్ ఐకాన్!

ఎం.ఎస్.ధోనీ ఇండియా కెప్టెన్‌గా సుదీర్ఘకాలం పాటు ఉన్నాడు. ఎప్పటికప్పుడు తన బ్యాటింగ్‌తోనే కాదు.. తన ైస్టెలిష్ లుక్‌తోనూ అదురగొడుతాడు. ప్రస్తుతం మరో కొత్త అవతారమెత్తాడు.

మిస్టర్ కూల్‌గా పేరొందాడు మన మాజీ కెప్టెన్ ఎం.ఎస్.ధోనీ. ఆయన ఏది చేసినా, ఏ నిర్ణయం తీసుకున్నా అది సంచలనమే. ఒకప్పుడు బారెడు జుట్టు పెంచుకొని అందరి మనసులూ కొల్లగొట్టాడు. మొన్నటికి మొన్న ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో తెల్లటి గడ్డంతో మెరిసిపోయాడు. లాంగ్ హెయిర్ తర్వాత కూడా వివిధ రకాల హెయిర్‌ైస్టెల్స్‌తో ఆకర్షించాడు. ఇప్పుడు ఇంగ్లాండ్ సిరీస్‌ని ముగించుకొని స్వదేశానికి వచ్చేశాడు. ఇక్కడికి వచ్చీ రాగానే తన లుక్‌ని మార్చే పనిలో మునిగిపోయాడు మిస్టర్ కూల్. ముంబైలోని ప్రముఖ హెయిర్ ైస్టెలిస్ట్ వద్దకు వెళ్లి వీ హాక్ ైస్టెల్ చేయించుకున్నాడు. ఆ సెలూన్ వారు ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ ఫొటోలు తెగ వైరల్ అయిపోయాయి. పైగా యువతరమంతా ఆ ైస్టెల్‌లో మెరిసిపోయేందుకు సెలూన్ల ముందు క్యూలు కట్టేస్తున్నారట.