హైదరాబాద్ నగర పర్యటన

తెలంగాణ టూరిజం శాఖ హైదరాబాద్ నగర పర్యటనకు ప్రత్యేక ప్యాకేజీని నిర్వహిస్తున్నది.ఈ పర్యాటనలో హైదరాబాద్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను చూపిస్తారు.

ఈ పర్యాటనలో బిర్లామందిర్, చౌహమల్లా ప్యాలెస్, చార్మినార్, మక్కామసీదు, లాడ్‌బజార్‌లో షాపింగ్( నడక), సాలార్‌జంగ్ మ్యూజియం (ఇక్కడే లంచ్ బ్రేక్ ఉంటుంది), నిజాం జూబ్లీ పెవిలియన్ (పురానీ హవెలీ), గోల్కొండ కోట, కుతుబ్‌షాహి టూంబ్స్, లుంబినీపార్క్ (ముగింపు పాయింట్) తదితర ప్రాంతాలను చూపిస్తారు. సమయం: ప్రతిరోజు ఉదయం 7.30 నిమిషాలకు ప్రారంభమయ్యే ప్రయాణం తిరిగి సాయంత్రం 7.30 నిమిషాలకు ముగుస్తుంది.

చార్జీలు

నాన్ ఏసీ బస్ పెద్దలకు-రూ.250, పిల్లలకు-రూ.200 ఏసీ బస్ రూ.350, పిల్లలకు-రూ.280 ఎంట్రీ టికెట్, భోజనానికి అదనపు చార్జీ గమనిక: శుక్రవారం రోజున అన్ని మ్యూజియాలు మూసి ఉంటాయి. అందువల్ల శుక్రవారం పర్యటించే వారికి మ్యూజియానికి బదులు జూ పార్క్‌ను చూపిస్తారు.