హానీమూన్ జంటలకు ‘మజులి’

ద్వీపం అనగానే ఎవరికైనా గుర్తుకు వచ్చేది సముద్రం మధ్యలో ఉన్న భూమి. అయితే నదుల మధ్య కూడా కొన్ని ద్వీపాలు ఉంటాయి. అలాంటి అరుదైన ద్వీపమే ఈ మజులి. ప్రపంచంలో ఇలా నదుల మధ్య ఉండే అరుదైన మంచినీటి ద్వీపాల్లో ఇదే పెద్ద ద్వీపం కావడం విశేషం. అసోం రాష్ట్రంలోని బ్రహ్మపుత్ర నది మధ్యలో ఏర్పడిన ఈ మజులి ద్వీప సౌందర్యాన్ని మనసారా వీక్షించడానికి రెండు కళ్ళు చాలవు. ఈ ద్వీపం మధ్యలో నిర్మించిన కాటేజ్‌లలో నుండి సూర్యాస్తమయాన్ని చూడటం ఓ మధురానుభూతి.

మజులి ద్వీపంలో చెట్లు, చేమలూ.. పుట్టలూ, నదీ జలాలు... ఇలా మజులి ద్వీపం గురించి ఏం చెప్పుకున్నా అవన్నీ కాలుష్యానికి దూరంగా, అతీతంగా నిలిచి ఉన్నాయి. కాలుష్య కర్కషత్వం ఈ ప్రాంతంపై పడలేదు కాబట్టి ఇప్పటికీ. .. మజులి సౌందర్యం ఏ మాత్రం ధ్వంసం కాకుండా, స్వచ్ఛంగా, ఆహ్లాదాన్ని పంచుతున్నది. ఏ రుతువులో చూసినా. ఈ అద్భుత ద్వీపంలో మానవ సంచారం ఉన్నప్పటికీ... నేటికి పచ్చని సౌందర్యంతో ప్రకృతికాంత పరవశిస్తూనే వుంది. అందుకే కొత్తగా పెళ్లైన దంపతులకు ఇదొక స్వర్గధామం అని చెప్పవచ్చు. అసోం నుండే కాకుండా ఇతర రాష్ర్టాల నుండి కూడా హనీమూన్ కపుల్ ఇక్కడ సందడి చేస్తారు. కొత్త వాతా వరణంలో, పూర్తి కొత్తదనంతో గడపాలనుకునే జంటలకు మజులి ఓ అద్భుతమైన అనుభవాన్నిస్తుందనడంలో ఏ మాత్రం అతిశయోక్తి కాదు.

Related Stories: