సారే జహాసె అచ్ఛ్చా

ప్రస్తుతం భారతీయ సినిమాలో బయోపిక్‌ల ట్రెండ్ ఊపందుకుంది. వివిధ రంగాల్లో స్ఫూర్తిప్రదాతలుగా నిలిచిన వ్యక్తుల జీవితాలు వెండితెరపై ఆవిష్కృతమవుతున్నాయి. అగ్రహీరోలు సైతం ఈ బయోపిక్‌లలో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. తొలి భారతీయ వ్యోమగామి రాకేష్‌శర్మ జీవితకథా చిత్రంలో బాలీవుడ్ బాద్షా షారుఖ్‌ఖాన్ కథానాయకుడిగా నటించబోతున్న విషయం తెలిసిందే. మహేష్ మతాయ్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని సిద్ధార్థ్‌రాయ్ కపూర్, రోనీస్క్రూవాలా నిర్మిస్తున్నారు. భూమిపడ్నేకర్ కథానాయికగా నటించనుంది. ఈ సినిమాకు సారే జహాసె అచ్ఛా అనే టైటిల్‌ను ఖరారు చేసే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు తెలిసింది. ఫిబ్రవరిలో ఈ చిత్రం సెట్స్‌మీదకు రానుంది. ప్రస్తుతం షారుఖ్‌ఖాన్ జీరో చిత్రంలో నటిస్తున్నారు.ఈ సినిమా డిసెంబర్‌లో ప్రేక్షకులముందుకురానుంది.