స్పాండిలైటిస్ నివారణకు..

మారిన జీవన విధానం కారణంగా స్పాండిలైటిస్ రోజురోజుకూ పెరిగిపోతున్నది. వయసు, లింగ భేదాలతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారికీ వస్తున్నది. దీనిని నివారణకు పోషక విలువలతో కూడిన ఆహారమే సరైందని న్యూట్రిషియనిస్టులు చెప్తున్నారు. Nutrian-Cillumn -స్పాండిలైటిస్ ఉన్నవారు వ్యాయామం, మెడిటేషన్, యోగా, పోషక విలువలతో కూడిన ఆహారంతో ఈ బాధకు చెక్ చెప్పొచ్చు. -ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ స్పాండిలైటీస్‌పై ప్రభావం చూపగలదని ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి. ఇవి ఎక్కువగా ఉండే అవిసె గింజలు, వాల్నట్స్, చేపలను తరచూ ఆహారంలో భాగంగా తీసుకోవాలి. -ప్రతి వారమూ వివిధ రకాల గ్రీన్ వెజిటెబుల్స్‌ను ఆహారంలో భాగం చేసుకోవాలి. వాటితో పాటు పండ్లనూ రోజూ తినాలి. ఇలా చేయడం వల్ల శరీరానికి కావల్సిన విటమిన్స్, మినరల్స్ అందుతాయి. కూరగాయలను ఎక్కువగా తీసుకోవడం వల్ల అధిక కేలరీలు అందుతాయి. -గట్ లైనింగ్ పెంచేందుకు పెరుగులో అరటి పండును తీసుకోవాలి. రోజూ అరటిపండ్లు తినడం వల్ల గట్ లైనింగ్‌కు రక్షణ ఏర్పడుతుంది. Nutrian-Cillumn1 -ఆహారంలో తృణధాన్యాలను కూడా భాగం చేసుకోవాలి. ఇవి నొప్పి నివారణకు బాగా పనిచేస్తాయి. -క్యాల్షియం అధికంగా ఉండే పాలు, జున్ను, ఆల్మండ్స్, పప్పు ధాన్యాలు, సోయాబీన్స్‌ను తీసుకోవాలి. -వీటితో పాటుగా ఆక్సాలిక్ యాసిడ్స్ అధికంగా ఉండే పాలకూర, మాంసం, గుడ్లు, చికెన్ వంటివి పరిమితంగా తీసుకోవాలి. -ఉప్పు తగ్గించి వాడడం, కాఫీ, పొగాకు, మద్యం, సాఫ్ట్‌డ్రింక్స్‌ను పూర్తిగా మానుకుంటే ఆరోగ్యానికి మంచిది. డాక్టర్ మయూరి ఆవుల న్యూట్రిషియనిస్ట్ mayuri.trudiet@gmail.com
× RELATED అమ్మతనం గొప్పదననీ