స్టెలిష్‌గా కనిపించండి!

-కొద్ది లావుగా, పొట్టిగా కనిపిస్తున్న వాళ్లు నడుము దగ్గర బిగుతుగా ఉన్న దుస్తులు ధరిస్తే.. పొడవుగా స్లిమ్‌గా కనిపిస్తారు. -మీకు ఎలాంటి కాంబినేషన్ దుస్తులు నప్పుతాయో వాటినే ధరించాలి. ఎంపిక చేసుకోవడంలో తెలివిగా వ్యవహరించాలి. -వీ షేప్ నెక్ ఉండే టాప్స్‌ను ధరించడం వల్ల మెడభాగం పొడవుగా ఉండేలా కనిపిస్తుంది. -కొంతమంది తమ శరీరాకృతికి సరిపడకపోయినా ఫ్యాషన్ అంటూ మోడ్రన్ దుస్తులు ధరించి నవ్వులపాలవుతుంటారు. దుస్తుల ఎంపిక సింప్లిసిటీగా ఉండేలా చూసుకోండి. -స్కర్ట్స్ వేసిన అమ్మాయిలు.. లైన్స్ ఉన్న స్కర్ట్స్ ధరిస్తే మోకాలు పొడవుగా ఉన్నట్లు కనిపిస్తుంది. -బాగా వాష్ చేసిన జీన్స్‌ను వేసుకొని, ఎత్తుగా ఉండే షూ వేసుకుంటే మీరు పొడవుగా కనిపిస్తారు. -ఈ ట్రెండ్‌ను బట్టి పురుషులకు గడ్డం సూట్ అయితే సరే. లైట్‌గా ట్రిమ్ చేసుకోవచ్చు. లేకపోతే క్లీన్ షేవ్ బెటర్.