స్టార్టప్ గృహిణులు!

ఫ్యాషన్‌కు అనుగుణంగా ట్రెండీ స్టార్టప్స్‌తో యువతకు పోటీగా వ్యాపారం చేస్తున్నారు. రెండు చేతులా సంపాదిస్తూ ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేస్తున్నారు.
కొచ్చి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌కు అడ్డాగా మారిపోతున్నది. దాదాపు 60 మంది ఒకేచోట స్టార్టప్ బిజినెస్‌లు ప్రారంభించారు. కొచ్చిలోని పనాంపిల్లి నగర్‌లో 20 స్టార్టప్ సముదాయాలు నిత్యం రద్దీగా కనిపిస్తుంటాయి. లక్షల్లో వ్యాపారం జరుగుతుంది ఇక్కడ. మార్కెట్లోకి వచ్చే కొత్త రకాల మోడల్స్.. ట్రెండీ వేర్స్‌లకు ఈ సెంటర్ పెట్టింది పేరు. మహిళలకు కావాల్సిన అన్ని రకాల ఐటమ్స్ లభిస్తుండటంతో పనాంపిల్లి నగర్ మహిళలకు ఎక్స్‌క్లూజివ్ షాపింగ్ సెంటర్‌గా మారింది. మొదటగా ఇక్కడ ఐషా థానియా అనే మహిళ ఆమె యారాలు ఇద్దరూ స్టార్టప్‌ను లాంచ్ చేశారు. సాధారణ రేట్లు.. నాణ్యమైన వస్తువులు దొరకడంతో మార్కెట్ ప్రియుల ఆదరణ రోజురోజుకూ పెరుగుతూ వచ్చింది. ఇదే పంథాలో పనాంపిల్లి నగర్ గృహిణులంతా ఒక్కొక్కరిగా స్టార్టప్స్ స్టార్ట్ చేయడంతో ఇదొక వర్తక సముదాయంగా మారిపోయింది. మహిళా ఆర్థిక స్వావలంబన దిశగా కొచ్చి గృహిణులు అడుగులేస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.