సెబీలో అసిస్టెంట్ మేనేజర్లు

ముంబైలోని సెక్యూరిటీస్ & ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ మేనేజర్ (గ్రేడ్ ఏ) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
-పోస్టు పేరు: అసిస్టెంట్ మేనేజర్ -మొత్తం ఖాళీల సంఖ్య: 120 (జనరల్-84, లీగల్-18, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ-8, ఇంజినీరింగ్ సివిల్-5, ఇంజినీరింగ్ ఎలక్ట్రికల్-5) విభాగాలవారీగా అర్హతలు: -జనరల్: ఏదైనా మాస్టర్ డిగ్రీ/ బ్యాచిలర్ డిగ్రీ (లా), బీఈ/బీటెక్, చార్టెడ్ అకౌంటెంట్, చార్టెడ్ సెక్రటరీ, చార్టెడ్ ఫైనాన్షియల్ అనలిస్ట్, కాస్ట్ అండ్ వర్క్ అకౌంటెంట్‌లో ఉత్తీర్ణత. -లీగల్: లా డిగ్రీ ఉత్తీర్ణత. -ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ: ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఐటీ, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌లో బీఈ/బీటెక్ లేదా మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ లేదా ఏదైనా డిగ్రీతోపాటు కంప్యూటర్/ఐటీ రంగంలో రెండేండ్ల అనుభవం ఉండాలి. -ఇంజినీరింగ్: సివిల్/ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో బీఈ/బీటెక్‌లో ఉత్తీర్ణత. -వయస్సు: 2018 ఆగస్టు 31 నాటికి 30 ఏండ్లకు మించరాదు. రిజర్వేషన్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. -పే స్కేల్: రూ. 28,150-55,600/- అదనంగా స్పెషల్ అలవెన్సులు, రెసిడెన్షియల్ అకామిడేషన్ సౌకర్యాలు ఉంటాయి. -ప్రొబేషనరీ పీరియడ్: రెండేండ్లు -అప్లికేషన్ ఫీజు: రూ. 850/-, ఎస్సీ , ఎస్టీ పీహెచ్‌సీ అభ్యర్థులకు రూ. 100/- -పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌తోసహా దేశవ్యాప్తంగా వివిధ సెంటర్లలో పరీక్షను నిర్వహిస్తారు. -ఎంపిక విధానం: మూడుదశల్లో (ఫేజ్ 1, ఫేజ్ 2, ఇంటర్వ్యూ) జరుగుతుంది. -ఫేజ్ 1లో ఆబ్జెక్టివ్ విధానంలో ఆన్‌లైన్ పరీక్ష (జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లిష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, టెస్ట్ ఆఫ్ రీజనింగ్ అండ్ అవేర్‌నెస్ ఆఫ్ సెక్యూరిటీస్ మార్కెట్) ఉంటుంది. ఫేజ్ 2 కూడా ఆన్‌లైన్ (మూడు పేపర్లు)లో ఉంటుంది. ఫేజ్ 2 తర్వాత షార్ట్‌లిస్ట్ అయినవారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. -దరఖాస్తు: ఆన్‌లైన్‌లో -ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: సెప్టెంబర్ 15 -వెబ్‌సైట్: www.sebi.gov.in