సిస్టర్ ఫర్ చేంజ్!

గతేడాది ఎంపీ కల్వకుంట్ల కవిత ప్రారంభించిన గిఫ్ట్ ఏ హెల్మెట్ క్యాంపెయిన్ విజయవంతం అయింది. మళ్లీ రక్షాబంధన్ వస్తున్న క్రమంలో ఈ క్యాంపెయిన్‌ని తిరిగి మొదలుపెట్టారు. పీవీ సింధు హెల్మెట్ ధరించి తన చిత్రాన్ని ట్వీట్ ద్వారా పోస్టు చేసింది. సంగీత దర్శకుడు రమణ గోగుల, దర్శకుడు వంశీ పైడిపల్లి గొప్ప కార్యక్రమంగా దీనిని అభివర్ణిస్తూ ట్వీట్లు చేశారు. కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా గతేడాది ఇచ్చిన ఈ పిలుపునకు విశేష స్పందన వచ్చింది. ద్విచక్రవాహన యాక్సిడెంట్లు ఎక్కువగా జరుగుతున్న క్రమంలో హెల్మెట్‌ను ధరించాల్సిన అవసరాన్ని తెలియజేస్తూ ఎంపీ కవిత గత ఏడాది సోదరులకు రాఖీ కట్టి హెల్మెట్‌ను బహుకరించాలని పిలుపునిచ్చారు. ఆమె పిలుపునందుకున్న పలువురు సెలబ్రిటీలతో పాటు క్రీడాకారులు, ప్రభుత్వ అధికారులు క్యాంపెయిన్‌ను ఫాలో అయ్యారు. కార్యక్రమ కొనసాగింపులో భాగంగా ఈ ఏడాది కూడా గిఫ్ట్ ఏ హెల్మెట్ క్యాంపెయిన్‌కు ఇప్పటి నుండే విశేష స్పందన వస్తున్నది.

Related Stories: