సాహసాల ప్రొఫెసర్!

ప్రొఫెసర్ అంటే తరగతి గదిలో విద్యార్థులకు పాఠ్య సంబంధిత ముచ్చట్లు చెప్పడమే కాదు.. అన్ని విషయాల్లో వారికి స్ఫూర్తిగా నిలవాలని సూచిస్తున్నారు మలయాళీ ప్రొఫెసర్ ఆనందవళ్లి. ఆమె వయసు 70 సంవత్సరాలు. విశ్రాంత దశలో ఇంట్లో కూర్చుంటే ప్రయోజనం ఏంటని అమృత యూనివర్సిటీలో విద్యార్థులకు విజ్ఞానాన్ని అందిస్తున్నారు.

ఆనందవళ్లికి చిన్నప్పట్నుంచీ పర్యటనలు అంటే ఇష్టం. ఇంట్లో చెప్పి ఒక్కర్తే సమీప పట్టణానికి వెళ్తుండేవారట. అలా కళాశాల దశకు వచ్చేసరికి ఒంటరి పర్యటనలు.. ట్రెక్కింగ్.. అడ్వెంచర్ టూరింగ్ అలవాటైంది. టార్గెట్ పెట్టుకొని మరీ ఆమె వేర్వేరు ప్రాంతాలు పర్యటించేవారు. ప్రొఫెసర్‌గా మారినప్పటికీ తనలోని అడ్వెంచర్ టూరింగ్ అభిరుచిని ఏమాత్రం వదులుకోలేదు. ఉద్యోగ బిజీ.. కుటుంబ బాధ్యతలు.. వయసు పైబడటం ఎన్ని జరిగినా ఆమె పర్యటనలను ఏవీ ఆపలేకపోయాయి. డెభ్బైయేళ్ల వయసులో కూడా ఆమె దేశ విదేశాలు చుట్టొస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. మూడ్రోజుల్లో లండన్ పర్యటనను పూర్తి చేసి రికార్డు సృష్టించారు. గత నెల 10వ తేదీన చెన్నై నుంచి బయలుదేరిన ఆనందవళ్లి లండన్‌లోని తన కూతురుకు సర్‌ప్రైజ్ ఇచ్చింది. అక్కడ గడిపిన ఆమె 12వ తేదీ వరకు తిరిగి చెన్నై చేరుకున్నారు. డ్బ్భైయేండ్ల వయసులో ఇంతటి ఉత్సాహంతో పర్యటించి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశారు.