సాంబారు రుచిగా..

-కొత్తిమీర కాడలను తరిగి పులుసు, సాంబారులో వేస్తే చారు సువాసన వస్తుంది. -సాంబార్‌లో కందిపప్పును ఉడికించే సమయంలో కాసిని మెంతులు వేస్తే.. రాత్రి వరకూ పాడవకుండా ఉంటుంది. -మిరపకాయలు కారం లేకుండా ఉండాలంటే వాటిని కోసేటప్పుడు కత్తికి కాస్త ఉప్పురాసి తరగాలి. -ఏదైనా పులుసులో ఉప్పు ఎక్కువైతే చపాతీ పిండిని ఏడు/ఎనిమిది ఉండలుగా చేసుకొని పులుసులో వేసి మరగబెట్టాలి. తర్వాత వాటిని తీసేస్తే పులుసు రుచికరంగా ఉంటుంది.