శనగపిండితో మెరిసేలా..!

చర్మం మీదిమృతకణాలు తొలిగిపోయి.. అది పునరుజ్జీవనం పొందాలంటే శనగపిండి బాగా పనిచేస్తుంది. ఈ పిండితో ఫేస్ మాస్క్‌లు ఎలా చేయాలో చదువండి..

-శనగపిండిలో కొద్దిగా పెరుగు కలిపి పేస్ట్‌లా చేయాలి. ఈ చిక్కని పేస్ట్‌ని ముఖానికి రాసి ఆరిన తర్వాత చల్లని నీటితో కడుక్కోవాలి. దీనివల్ల ట్యాన్ తొలిగిపోయి చర్మం కాంతివంతంగా మెరిసిపోతుంది. -పొడిచర్మం ఉన్నవాళ్లకు ఈ ప్యాక్ బాగా పనిచేస్తుంది. శనగపిండి, పాలు కలిపి పేస్ట్‌లా చేసి ముఖానికి రాయాలి. ఆరిన తర్వాత కడిగితే మేనిఛాయ మెరుగవుతుంది. -పిగ్మేంటేషన్ సమస్యను, మచ్చలను మాయం చేయాలనుకుంటున్నారా? అయితే ఈ ప్యాక్ వేసుకోండి. శనగపిండిలో టమాటా పేస్ట్ కలిపి ముఖం, మెడ మీద రాయాలి. బాగా ఆరిన తర్వాత సాధారణ నీటితో శుభ్రం చేసుకోవాలి. -తాజా శనగపిండిలో నిమ్మరసం కలిపి ముఖానికి రాయాలి. 20 నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరుచుగా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. -శనగపిండిలో, పసుపు వేసి పచ్చి పాలు పోస్తూ ఉండలు లేకుండా కలుపాలి. దీన్ని ముఖానికి రాసి మర్దన చేయాలి. పావుగంట తర్వాత కడిగేయాలి.

Related Stories: