వేడినీటి గుండాలు

నదీజలాలు అంటే చల్లగా ఉంటాయని మాత్రమే మనకు తెలుసు. కొన్ని సమయాల్లో మాత్రమే కొద్ది వేడిగా ఉంటాయి. కానీ మరుగుతూ ఉండే వేడినీటి గుండాలను మీరెప్పుడైనా చూశారా? లేదంటే హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాకు వెళ్లాల్సిందే. హాట్‌వాటర్ స్ప్రింగ్ అని పిలిచే ఈ వేడినీటి గుండాలు సిమ్లా విహారంలో ప్రత్యేక ఆకర్షణ. తత్తపాని అని పిలిచే ఈ వేడినీటి గుండంలో స్నానం చేయడం ఎంతో ఉల్లాసాన్నిస్తుంది. ఈ నీటి గుండంలో తప్ప దాని చుట్టుపక్కల పరిసరాలన్నీ రక్తం గడ్డకట్టించేంతగా చల్లగా ఉంటాయి. కానీ, ఈ వేడినీటి గుండంలోని నీరు మాత్రం మరుగుతూ ఉంటుంది. ఈ నీటిలో సల్ఫర్ ఉన్న కారణంగా రసాయనిక చర్య జరిగి అలా జరుగుతూ ఉంటుందట. అందుకే ఇక్కడ స్నానం చేస్తే చర్మవ్యాధులు నయమవుతాయని నమ్ముతుంటారు. ఇలాంటి గుండాలు సిమ్లాలో చాలా ఉన్నాయి.