వెటిరో టైల్స్ జోరు..

ఏడాది క్రితం అపర్ణా గ్రూప్ నుంచి మార్కెట్‌లోకి విడుదలైన వెటిరో టైల్స్ ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. వినియోగదారుల అభిరుచులకు తగ్గట్టు అందిస్తున ఆ సంస్థకు టైల్స్ విక్రయాల వల్ల ఏడాదిలోనే రూ. 75కోట్ల ఆదాయం వచ్చింది. ఆగస్టు 2017నుంచి జూన్ 2018 వరకు గాను త్రైమాసిక వృద్ధి 5శాతం నమోదైనట్లు అపర్ణా గ్రూప్ వెల్లడించింది. నాణ్యాత, సేవల్లో ఏలాంటి లోపం లేకుండా ఏపీ, తెలంగాణ, కర్ణాటకలోని ప్రభుత్వ, ప్రైవేటు ప్రాజెక్టులను చేజిక్కించుకున్నట్లు అపర్ణ ఎంటర్‌ప్రైజెస్ ఎండీ అశ్విన్ రెడ్డి తెలిపారు. వినియోగదారుల నుంచి అనుకున్న దానికంటే ఎక్కువ స్పందన వస్తున్నదని, ఇది మాకు సరికొత్త ప్రోత్సాహాన్ని అందిస్తున్నదని అబిప్రాయపడ్డారు. త్వరలో గ్లేజ్ విట్రిఫైడ్ టైల్స్ (జీవీటీ), పాలీష్డ్ గ్లేజ్ విట్రిఫైడ్ టైల్స్ (పీజీవీటీ)ల తయారీలోకి ప్రవేశిస్తున్నట్లు అశ్విన్ రెడ్డి వెల్లడించారు. టైల్స్ పరిశ్రమలో భారత్‌ని అగ్రస్థానంలో నిలపడంతో పాటు, తమ వినియోగదారుల అభిరుచిని సంతృప్తి పరిచేలా ఉత్పత్తులు అందించాలనే లక్ష్యంతో పని చేస్తున్నట్లు తెలిపారు. నిరంతర పరిశోధన, నూతన ఆవిష్కరణలకు తమ సంస్థ పెద్దపీట వేస్తున్నదని, నాణ్యత, సేవల్లో మెరుగుదలను పెంచేందుకు నిత్యం శ్రమిస్తున్నట్లు ఆ సంస్థ టెక్నికల్ డైరెక్టర్ టి చంద్రశేఖర్ తెలిపారు. మరింత మన్నికగా, మరింత నాణ్యతగా ఉండే టైళ్లను వినియోగదారులకు అందించాలన్నదే తమ లక్ష్యం అన్నారు.