దండుపాళ్యం దర్శకుడితో..

దండుపాళ్యం సిరీస్ చిత్రాలతో దర్శకుడిగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు శ్రీనివాసరాజు. ఆయన దర్శకత్వంలో సుమంత్ అశ్విన్ హీరోగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఓ చిత్రం సెట్స్‌పైకి రానుంది. గరుడవేగ ఫేమ్ ఎం.కోటేశ్వరరాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. దర్శకుడు మాట్లాడుతూ కథ డిమాండ్ మేరకు నాలుగు భాషల్లో నిర్మిస్తున్నాం. సుమంత్ అశ్విన్ హీరో. ఇతర పాత్రల్లో భారీ తారాగణం నటిస్తారు. నేపథ్య సంగీతానికి అధిక ప్రాధాన్యం వున్న హారర్ థ్రిల్లర్ ఇది. అందుకే మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ తరహా చిత్రాల్లో ట్రెండ్ సెట్టర్ అవుతుంది. దండుపాళ్యం సిరీస్ చిత్రాల సక్సెస్‌ని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తున్నాం అన్నారు. నవంబర్ రెండవ వారంలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి నాలుగు భాషల్లో ఒకేసారి చిత్రాన్ని విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నాం అని ఎగ్జిక్యూటివ్ నిర్మాత విజయ్‌వర్మ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: శ్యామ్ ప్రసాద్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీనివాసరాజు.