వానకాలంలో పచ్చికందులు మేలు!

వానకాలంలో పచ్చికందులను సూప్‌ల్లోగాని, కూరల్లో గానీ వేసుకొని తింటే చాలా రోగాలకు దూరంగా ఉండొచ్చునని అంటున్నారు వైద్య నిపుణులు. పచ్చికందులలో ప్రొటీన్స్, విటమిన్లు, పీచుపదార్థాలు, ఖనిజ లవణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. పచ్చికందులను తినడం వల్ల రక్తహీనతను దూరం చేయవచ్చు. వర్షాకాలంలో పచ్చికందులలోని శక్తి వల్ల జలుబు, దగ్గును దూరం చేస్తుంది. పచ్చికందులు రక్త అబివృద్ధిని పెంచి గుండె జబ్బులను దూరం చేస్తాయి. పచ్చికందుల్లో ఉండే ఫోలియాసిడ్ గర్భిణులకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇంకా వీటిలో మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, కాపర్, ఐరన్, జింక్ వంటివి అధికంగా ఉంటాయి. పచ్చికందుల్లో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండడం వల్ల క్యాన్సర్ కణాలపై పోరాడే శక్తి ఎక్కువగా ఉంటుంది. మామూలు కందిపప్పుతో పోలిస్తే పచ్చి కందికాయలలో 25 శాతం ఎక్కువ పోషకాలు అందుతాయి. వేడివేడిగా ఉడకబెట్టినవి తినడం వల్ల దగ్గు, ఛాతి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. పప్పుతో పాటు సూపుల్లో కూడా పచ్చికందులను వేసుకొని తింటే రుచిగా ఉంటాయి. ఇలా పచ్చికందులను వర్షాకాలంలో, శీతాకాలంలో వంటల్లో చేర్చుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు.