వంట చిట్కాలు

-పచ్చిమిర్చికి గాట్లు పెడితే నూనెలో వేయించేటప్పుడు పేలకుండా ఉంటాయి. -బంగాల దుంప ముక్కల్ని ఉప్పు నీళ్ళల్లో అరగంట నానబెట్టి వేయిస్తే ముక్కలు రుచిగా ఉంటాయి. -వేడిచేసిన గరిటతో జాడీలో నుంచి ఊరగాయను బయటకు తీస్తే అది పాడవకుండా ఉంటుంది. -దోసల పిండి బాగా పులిస్తే అందులో రెండు చెంచాల గోధుమ పిండి కలపండి. -బెండకాయ, వంకాయ వంటి కూరలు రుచిగా ఉండాలంటే నూనెలో కాస్త మొక్కజొన్న పిండి కలిపితే సరిపోతుంది.