వంటింటి చిట్కాలు

-పదార్థాలు మాడిపోయి పెనం నల్లగా తయారరైతే దానిమీద సబ్బునీళ్లు పోసి, సన్నటి సెగ మీద ఉంచి చల్లారాక రుద్దాలి. -వంటకాల్లో కారానికి బదులు మిరియాల పొడిని వేస్తే రుచిగా ఉంటుంది. -బియ్యం, తృణ ధాన్యాలను నిల్వ ఉంచిన డబ్బాలో నాలుగు పసుపు కొమ్ములు లేదా వెల్లుల్లి వేస్తే పురుగు పట్టదు. -గిన్నెలకు గ్రీజు మరకలు అంటితే సబ్బునీళ్లలో వెనిగర్ కలిపి రుద్దితే పోతాయి. -వాడేసిన నిమ్మ చెక్కలతో లంచ్‌బాక్స్‌ని రుద్దితే వాసన రాకుండా ఉంటాయి. -ఇత్తడి, రాగి పాత్రలను మగ్గిన అరటిపండు గుజ్జుతో తోమితే కొత్తవాటిలా మెరుస్తాయి. -కూరలో ఉప్పు ఎక్కువైతే కాస్త బియ్యప్పిండి కలపాలి.