వంటింటి చిట్కాలు

-బియ్యం నిల్వ ఉంచిన డబ్బాలో నాలుగు ఎండు మిరపకాయలు వేస్తే పురుగు పట్టదు. -పెరుగు పచ్చడి మరింత రుచిగా ఉండాలంటే తాలింపులో చెంచా నెయ్యి వేస్తే సరిపోతుంది. -పిండిలో పావు కప్పు వేయించిన సేమియా వేస్తే, గారెలు మరింత రుచిగా ఉంటాయి. -అరటికాయ ముక్కలను కాసేపు మజ్జిగలో వేసి తీసి వేయిస్తే చక్కగా వేగుతాయి. -ఇడ్లీ దోస పిండి మరునాటికి పులవకుండా ఉండాలంటే, గిన్నె మీద తడి వస్త్రం కప్పాలి లేదా సోడా ఉప్పు వెయ్యాలి. -మజ్జిగ పలచన అయితే పది కరివేపాకు రెబ్బలు, కాస్త ఉప్పు కలిపి నూరి ముద్దలా చేసి కలిపితే చిక్కపడుతుంది.