వంటింటి చిట్కాలు

-కాఫీపొడి గడ్డ కట్టకుండా ఉండాలంటే దాన్ని గాలి చొరని డబ్బాలో పెట్టి డీప్ ఫ్రిజ్‌లో ఉంచండి. -వంటగదిలో చీమలు ఇబ్బంది పెడుతుంటే... ఒక దోసకాయను ముక్కలుగా కోసి చీమలు తిరిగే చోట పెట్టండి. -కూరగాయలు వాడిపోయాయా..? నిమ్మరసం కలిపిన నీటిలో ఓ పదినిమిషాలు ఉంచండి. తాజాగా అవుతాయి. -కూరల్లో మసాలా ఎక్కువైందా? రెండు మూడు టమాటాలను ఉడికించి అందులో కలపండి. మసాలా ఘాటు తగ్గుతుంది.