రాగి చెంబులోని నీళ్లు..

రాగి పాత్రలను, చెంబులను, గ్లాసులను, బాటిళ్లను వాడడం ద్వారా అనారోగ్య సమస్యలు దూరం చేసుకోవచ్చు. ఈ మాట మేం చెప్పేది కాదు.. ఆరోగ్య నిపుణులే చెబుతున్నారు.

రాగి పాత్రలో కేవలం మూడు గంటల పాటు నీటిని నిల్వ ఉంచితే చాలు.. నీటిలో ఉండే క్రిములు నశిస్తాయి. నీటిలో ఉండే ప్రమాదకరమై ఈ-కొలి బాక్టీరియా కూడా అంతమవుతుందంటున్నారు వైద్యులు. దీనిలోని నీటిని తాగడం వల్ల అసిడిటీ, అజీర్ణం, డయేరియా, కామెర్లు, కీళ్లనొప్పులు తగ్గుతాయి. అధిక బరువూ తగ్గుతారట. గుండె సమస్యలు రావు. క్యాన్సర్ లక్షణాలు నశిస్తాయి. థైరాయిడ్ గ్రంథి పని తీరు మెరుగవడమే కాదు.. రక్తహీనత, హైబీపీ తగ్గుతాయంటున్నారు. పరిగడుపునే రాగి చెంబులో నీళ్లు తాగడం వల్ల పెద్ద పేగు శుభ్రపడి.. మనం తినే ఆహారంలోని పోషకాలను ఎక్కువగా గ్రహిస్తుంది. శ్వేత ధాతువులను సమతుల్యం చేస్తాయి ఇందులోని నీళ్లు. కాబట్టి ఉదయం ఒక చెంబెడు ఈ నీళ్లు తాగితే కండరాలలో కణాల ఉత్పత్తి పెరుగుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.