మేల్కొలుపు

మాతస్సమస్త జగతాం మధుకైట భారే: వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే శ్రీ స్వామిని శ్రితజన ప్రియ దానశీలె శ్రీ వేంకటేశదయితే తవ సుప్రభాతమ్‌॥

సమస్త లోకాలకు తల్లివి, మధు-కైటభ రాక్షసులను సంహరించిన శ్రీ మహావిష్ణువు వక్షస్థలంపై విహరించే మాతవు, మనోహరంగా వెలుగొందే పవిత్ర జననివి, స్వామిని ఆరాధించే భక్తులకు వరాలిచ్చే అమ్మవు, శ్రీ వేంకటేశుని ప్రియసఖివైన ఓ మహాలక్ష్మీ.. ఈ శుభోదయ వేళ నీకిదే మా మేల్కొలుపు.