జగ్జీవన్ రాం భారతజాతి గర్వించదగిన నాయకుడు: సీఎం

హైదరాబాద్ : స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రాం వర్ధంతి వేడుకలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. జగ్జీవన్ రాం సేవలను ముఖ్యమంత్రి కేసీఆర్ స్మరించుకున్నారు. అణగారిన, నిర్లక్ష్యానికి గురైన వర్గాల జీవన ప్రమాణాల్లో మార్పులు రావడానికి కృషి చేసిన బాబు జగ్జీవన్ రాం భారతజాతి గర్వించదగిన నాయకుడు అని పేర్కొన్నారు. అంటరానితనాన్ని రూపుమాపేందుకు జగ్జీవన్ రాం విశేష కృషి చేశారని తెలిపారు. ప్రజాస్వామ్యబద్ధంగా హక్కుల సంరక్షణ, సమానత్వ సాధనకు కృషి చేసి ఎందరికో జగ్జీవన్ రాం స్ఫూర్తిగా నిలిచారని చెప్పారు.

Related Stories: