మీనా ముందుచూపు!

మీనా కందసామి.. తన మాటలతో ఎంతోమంది మహిళల్ని ముందుకు నడిపిస్తున్నది. ప్రసంగాలతో అందర్ని ఆలోచింపజేస్తున్నది. ఈమె రచించిన పుస్తకం ఎంతోమందికి స్ఫూర్తినిస్తున్నది. స్త్రీలను చిన్న చూపు చూసేవారికి తగిన సమాధానాలను ఇస్తున్నది.

టెక్నాలజీతో పనిచేస్తున్న ఈరోజుల్లో కూడా మతాల పేరుతో ప్రజలను చిన్న చూపు చూస్తూనే ఉన్నారు చాలామంది. ముఖ్యంగా దళిత వర్గానికి చెందిన మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం ఇంకా మానుకోవడంలేదంటూ తమిళనాడుకు చెందిన మీనా కందసామి ఆరోపణలు చేస్తున్నది. ఈమె దళిత కుటుంబంలో పుట్టింది. అందువల్ల ఎన్నో అవమానాలను, అవహేళనలను ఎదుర్కొన్నదట. అందుకే ప్రజల్లో మార్పు తీసుకురావడానికి తనవంతు ప్ర యత్నం చేయాలనుకున్నది. విప్లవాత్మక కవితలతో మార్పు తేవాలనుకుంది. తనలోని భావాలన్నింటినీ రాసి పుస్తకం ముద్రించింది. టచ్, మిసెస్ మిలిటాన్సీ పేరుతో ఆ పుస్తకాలను విడుదల చేసింది. ఈ భూమ్మీద పుట్టిన ప్రతీ జీవి సమానమే.

ఎటువంటి భేదభావాలు లేకుండా జీవించాలే తప్ప మత భేదాలతో కల్లోలాన్ని సృష్టించకూడదు. వీటితో పాటు కొంచెం సహనంతో ఉండాలి. ప్రతీదానికి గొడవలు పడకూడదని ఈ పుస్తకం ముఖ్య ఉద్దేశం. మీనా రచనలు ఎందరికో స్ఫూర్తినిస్తాయి. ఆమె రచయిత మాత్రమే కాదు. ప్రసంగాలు ఇవ్వడంలో మంచి నేర్పరి. ఆమె ప్రసంగాలు వింటుంటే రోమాలు నిక్కపొడుచుకుంటాయట. స్త్రీలను చిన్న చూపు చూస్తున్న పురుషులందరికీ ఆమె రచనలు గుణపాఠాలు. ఈ ప్రసంగాలను విన్న కొంతమంది తప్పుగా భావించి ఎదురుప్రశ్నలు వేసినా తను ఏమాత్రం జంకకుండా అన్నిటికీ చక్కగా జవాబులు చెబుతూ అందరి ప్రశంసలు పొందుతున్నది.

Related Stories: