మామిడి చూర్ణమా..మజాకా..!

మామిడి పచ్చిదైనా, పండైనా, చివరికి ఎండినా సరే.. దానిలో ఔషధగుణాలు మెండుగా ఉంటాయి. ఈ చూర్ణాన్ని ఆహారంగా తీసుకుంటే చాలా ప్రయోజనాలున్నాయి.

మామిడిపండులో విటమిన్ ఎ, ఇ, ఇంకా ఐరన్‌లు అధికంగా ఉంటాయి. మామిడిపండు ఎసిడిటీ నుంచి ఉపశమనం కలిగించడంతో పాటు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మామిడిపండులో ఉండే విటమిన్ సి శరీరంలోని అనవసర కణాలను తొలిగించి, క్యాన్సర్ నుంచి రక్షిస్తుంది. మామిడిచూర్ణం మలబద్దకాన్ని నియంత్రిస్తుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు బరువు తగ్గించడంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. మామిడిచూర్ణం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా కంటిచూపును మెరుగుపరుస్తుంది. మామిడిపండులో విటమిన్ ఎ, సి, డి, బి6 లు శరీరానికి హానికలిగించే విషతుల్యాలను తొలిగిస్తాయి. హృద్రోగ సమస్యలు నివారించే ఆయుర్వేద ఔషధాల్లో మామిడి చూర్ణాన్ని వాడుతారు. ఇది గుండెకు మేలు చేస్తుంది. విటమిన్ లోపం వల్ల కలిగే వ్యాధులను మామిడిచూర్ణం నివారిస్తుంది.