మహిళలకు మహిళలే!

మహిళకు మహిళే శత్రువు అంటారు కొందరు. కానీ మహిళలకు మహిళల ఆదరణే ఆయుష్షుగా మారుతుందని చెప్తున్నారు నిపుణులు. మహిళలకు.. మహిళలే తోడుగా ఉంటే ఎలాంటి సమస్యలైనా తొలగిపోతాయని వారు చెప్తున్నారు. అందుకే సమాజంలోని అపోహలు పోవాలని వారు పిలుపునిస్తున్నారు.

యూనివర్సిటీ ఆఫ్ మిన్నెసోటాకు చెందిన కార్ల్‌సన్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ విభాగం తాజాగా ఒక అధ్యయనం చేసింది. మహిళల ఆరోగ్యం.. చికిత్స అనే అంశంపై చేసిన ఈ అధ్యయనంలో కొన్ని ఆసక్తికర విషయాలు తెలిశాయి. పురుష డాక్టర్లు 1000 మంది మహిళా పేషెంట్లకు అత్యవసర వైద్య చికిత్స అందిస్తే అందులో దాదాపు 15మందికి పైగా ఎక్కువ మరణిస్తున్నారట. అదే మహిళా వైద్యులు అయితే మృతుల సంఖ్య చాలా తక్కువగా ఉంటున్నట్లు పరిశోధకులు స్పష్టం చేశారు. మహిళా డాక్టర్లు పేషెంట్లపై కనబర్చే శ్రద్ధ పురుష డాక్టర్ల కంటే ఎక్కువగా ఉంటుందట. అంతేకాదు.. మహిళా డాక్టర్ల సేవలు చికిత్స చేసినట్లుగా కాకుండా వారికి చేయూత ఇచ్చినట్లుగా.. ఆదరించినట్లుగా ఉంటుందని చెప్తున్నారు. దీనినిబట్టి మహిళలకు మహిళలే తోడుగా ఉంటారని చెప్పొచ్చు అని వారు పేర్కొన్నారు.

Related Stories: