మరకలు వదిలేదెలా?

-బూజు, నాచు మరకలు వంటి వాటిని తొలగించడానికి ఇంట్లో ఉప్పును ఉపయోగించడం ద్వారా మంచి ప్రయోజనాలను పొందవచ్చు. ఉప్పును ఉపయోగించడం వల్ల ఏండ్ల తరబడి పేరుకు పోయిన క్రిమి కీటకాలను, మొండి మరకలను ఇట్టే వదిలించవచ్చు. ఉప్పు ఫంగస్‌ను నిరోధించడంలోనూ, గాలిలో ఉండే తేమను పీల్చుకుంటుంది. -ఆవపిండిలో బూజును రాకుండా చేసే గుణాన్ని కలిగి ఉంటుంది. గోడల మీద ఉండే దుమ్ము, ధూళే కాకుండా సీలింగ్స్‌పై ప్రభావం చూపి ఇల్లంతా ప్రకాశవంతంగా కనిపిస్తుంది. ఒక గిన్నెలో ఆవపిండి పోసి నాచు ఉన్న ప్రదేశాలలో ఉంచితే చాలు మంచి ఫలితాలను పొందవచ్చు. -వైట్ కలర్ వెనిగర్, నిమ్మరసం పర్యావరణాన్ని శుభ్రపరిచే వాటిలో ముఖ్యమైంది వెనిగర్. తెల్ల వెనిగర్‌ను ఉపయోగించడం ద్వారా ఇంటిని దుర్వాసనలు, మరకల నుంచి రక్షించుకోవచ్చు.