మధుబని ఆర్ట్ రైలు!

ఇప్పటివరకు బ్లూ రంగులో ఉండే రైలును చూసుంటారు. కానీ రంగురంగుల బొమ్మలతో ఉండే రైలును చూశారా? బీహార్ నుంచి ఢిల్లీకి వెళ్లే రైలు మాత్రం పూర్తి భిన్నంగా ఆర్ట్ వర్క్‌తో డిజైన్ చేయబడింది. దీన్ని డిజైన్ చేసింది మహిళలే. ఇండియాలో మధుబని ఆర్ట్ వేసిన ఈ రైలు రెండోస్థానంలో ఉంది.

బీహార్ నుంచి ఢిల్లీకి వెళ్లే ఈ రంగురంగుల రైలును చూడడానికి జనాలు ఎగబడుతున్నారు. ఇంతకీ దీని ప్రత్యేకత ఏంటంటే ఇది రంగురంగుల బొమ్మలతో ఆకట్టుకుంటుంది. ఈ రైలుకు 30 మంది మహిళలు కలిసి నాలుగురోజుల పాటు రంగులబొమ్మలతో అలంకరించారు. ఈ ఆర్ట్ వేయడానికి చేతివేళ్లు, అగ్గి పుల్లలు, బ్రషెస్, సహజ రంగులను ఉపయోగించారు.ఈ ట్రైన్‌కి 9 కోచ్‌లో, ఒక పాంట్రీ కారు, నాలుగు ఏసీ కోచ్‌లు, మూడు స్లీపర్ క్లాస్ కోచ్‌లు, ఒక జెనరల్ కంపార్ట్‌మెంట్ ఉన్నాయి. ఈ మధుబని రైల్వేస్టేషన్ సమస్తపూర్ డివిజన్ కిందకి వస్తుంది. అన్నీ రైల్వే స్టేషన్ కంటే మధుబని రైల్వే స్టేషన్ చాలా అందంగా ఉంటుందని ఈస్ట్‌కోస్ట్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ప్రకటించడంతో ఈ అందమైన రైల్వేస్టేషన్‌ను చూడడానికి జనాలు తరలివస్తున్నారు.

Related Stories: