మచ్చలేని మోముకు పసుపు!

పూర్వీకుల నుంచి సౌందర్య ప్రయోజనాల కోసం పసుపు వాడడం చూశాం. దీంట్లో ఉండే యాంటీ బాక్టీరియల్, యాంటీ సెప్టిక్ లక్షణాలు చర్మాన్ని కొత్త రూపు సంతరించుకునేలా చేస్తాయి. ఇంకా దీంతో ఏం కలిపితే చర్మం నిగనిగలాడుతుందో తెలుసా?
-ఒక గిన్నెలో పెరుగు, తేనె, కొబ్బరినూనె వేశాక పసుపు వేసి బాగా కలుపాలి. ఇలా చేసిన మిశ్రమాన్ని ముఖం మీద రాయాలి. పూర్తిగా ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా తరుచుగా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. -జామ ఆకులను, పసుపుతో కలిపి మెత్తని పేస్ట్‌లా చేయాలి. దీన్ని మొటిమలు ఉన్న చోట రాసి కాసేపు వదిలేయాలి. ఆ తర్వాత చల్లని నీటితో కడిగితే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల మొటిమలు తగ్గుముఖం పడుతాయి. -పసుపు, మీగడ, శనగపిండి.. కలిపి పేస్ట్‌లా చేయాలి. జిడ్డు చర్మం వాళ్లు మీగడకి బదులు పాలు వాడుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి మర్దన చేయాలి. ఇలా చేస్తే మృతకణాలు తొలిగిపోయి ముఖం కాంతివంతమవుతుంది. -పసుపు, బియ్యంపిండి, టమాటారసం, పాలు అన్నిటినీ ఒక గిన్నెలో వేసి బాగా మిక్స్ చేయాలి. దీన్ని ముఖానికి, మెడకు రాసి అరగంట ఆరనివ్వాలి. ఆ తర్వాత కడిగేయాలి. -పసుపు, నిమ్మరసం కలిపి ముఖానికి రాయాలి. ఇరవై నిమిషాల తర్వాత నీటితో కడిగేయాలి. ఇది ప్రతిరోజూ చేస్తే పిగ్మెంటేషన్‌ని తగ్గిస్తుంది. -చెంచాడు పసుపులో, బియ్యంపిండి, టమాటారసం, పాలు కలిపి పేస్ట్ చేయాలి. దీన్ని ముఖానికి రాసి ఇరవై నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా వారానికొకసారి చేస్తే ముడుతలు తగ్గుతాయి.