మందుపూతతో.. పురుగుకు వాత

Plant1 రాష్ట్ర వ్యాప్తంగా అత్యధికంగా సాగు అవుతున్న పంటలలో పత్తి పంట ప్రధానమైంది. అయితే సాగు పెరుగుతున్నప్పటికీ అవసరమైన సస్యరక్షణ చర్యలు మాత్రం రైతులు తీసుకోవడం లేదు. విరివిగా రసాయనక మందులను వాడుతున్నారు. పత్తిపంటను ఆశిస్తున్న చీడపీడలలో రసం పీల్చే పురుగుల వల్ల పంటకు తీవ్ర నష్టం వాటిల్లుతున్నది. విత్తనశుద్ధి చేస్తున్నందున విత్తనం నాటిన నాటినుంచి 20 రోజుల వరకు మొక్కలు రసం పీల్చే పురుగును తట్టుకునే శక్తి ఉంటుంది. అయితే 20 రోజుల తరువాత ఈ పురుగు సోకడంతో రైతులు అధిక వ్యయం చేసి రసాయనక మందులను పిచికారీ చేస్తున్నారు. ఈ విధానానికి బదులు అతి తక్కువ ఖర్చుతో పత్తి పంటకు మందుపూత ద్వార ఈ పురుగుకు అడ్డుకట్ట వేయవచ్చని ఖమ్మం జిల్లా వైరా కృషి విజాన కేంద్రం శాస్త్రవెత్తలు సూచిస్తున్నారు. మందుపూత విధానం ఎలా చేయాలి. తద్వార కలిగే ప్రయోజనాలు ఎమిటన్నది శాస్త్రవేత్తలు తెలిపారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలకు వైరా కృషివిజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కే రవికుమార్‌ను ఈ నంబర్ ద్వారా 96030 96769 సంప్రదించవచ్చు. Plant

లాభాలు

మందుపూత పద్ధతి ద్వారా రైతులకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా మందుల పిచికారీకి అయ్యే ఖర్చును తగ్గించుకునేందుకు అవకాశం ఉంటుంది. పిచికారీ పద్ధతి లేదు కాబట్టి పంటలకు ఉపయోగకరమైన, రైతులకు సహాయపడే అక్షింతల పురుగులు, కందిరీగలను వృద్ధి చేసుకోవచ్చు. మిత్ర పురుగుల వల్ల హాని చేసే పురుగులను నాశనం చేయవచ్చు. మందు పిచికారీ తగ్గించడం వల్ల పర్యావరణ కాలుష్యం తగ్గుతుంది.

మందు పూత పద్ధతి ఇలా..

పత్తిపంటను ఆశించే రసం పీల్చే పురుగులను అరికట్టేందుకుగాను ఈ విధానం ఎంతగానో ఉపయోగపడుతుంది. మొక్క కాండానికి మందుపూత పద్ధతి మూడు సార్లు చేయాలి. పంట వయస్సు 30-45 రోజులలో ఉన్న సమయంలో మోనోక్రోటోఫాస్, నీరు 1:4 నిష్పత్తిలో అనగా 25శాతం మోనోక్రోటోఫాస్ మందును తీసుకోవాలి. దానికి నాలుగు వంతుల నీరును కలుపుకోవాలి. పంట వయస్సు 60 రోజులలో ఉన్న సమయంలో ఇమిడాక్లోప్రిడ్, నీరు 1:20 నిష్పత్తిలో కలుపుకొని పూయాలి.

శ్రమ లేకుండా..

కాండానికి మందు మిశ్రమాన్ని వేపపుల్లతో లేదా, బ్రష్‌తో కాండానికి మందును పూతగా పెడుతారు. దీంతో మందును పూసే మహిళలు కానీ శారీరకంగా ఇబ్బందులు పడుతుంటారు. మందును ప్రతిసారి వేపపుల్లకు గాని బ్రష్‌గాని పూయడం వల్ల సమయాభావం ఏర్పడుతుంది. అదే విధంగా చిన్న సైజు పరికరాలు కావడం వల్ల మొక్క ఎక్కువ విస్తీర్ణంలో పంటకు అనుకూలం కాక పోవచ్చు.

శాస్త్రవేత్తల పరిష్కారం..

పత్తిపంటకు సంబంధించి మందుపూత విధానం తేలికగా, సులభతరం కోసం ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు నూతన విధానం తీసుకవచ్చారు. ైస్టెమ్ అప్లికేటర్ అనే పరికరాన్ని రూపొందించారు. దీనికి ఒకవైపు పొడగాటి ప్లాస్టీక్ పైపు, పైపుకు కింద భాగాన గుండ్రటి మొత్తని స్పాంజ్‌లాంటి పరికరాన్ని తయారు చేశారు. ఈ పరికరాన్ని ఒకసారి మందు కలిపిన బకెట్‌లో ముంచి దాదాపు 400 మొక్కలకు మందును పూసుకునేందుకు వెసులుబాటు కలుగుతుంది. తద్వార సమాయాభావం కలిసి వస్తుంది. అంతే కాకుండా శారీరకశ్రమ సైతం తగ్గుతుంది. అతి తక్కువ సమయంలో ఎక్కవ మొక్కలకు మందు పూయడానికి అనుకూలంగా ఉంటుంది. -మద్దెల లక్ష్మణ్, ఖమ్మం వ్యవసాయం, 9010723131 RAVIKUMAR

More in రైతుబ‌డి :