భార్యకోసం మట్టికోట కట్టాడు!

భార్య మీద ప్రేమతో షాజహాన్ తాజ్‌మహల్ కట్టాడు. కులీకుతుబ్ షా భాగ్యనగరం పేరుతో విశ్వనగరానికే పునాదులు వేశాడు. బిహార్ మౌంటెన్ మ్యాన్ మాంజీ గుట్టను తొలచి ఊరికి రోడ్డు వేశాడు. ఇలా చెప్తూ పోతే ప్రేమ కోసం ఎందరో, ఎన్నో చేసిన సంఘటనలు ఉన్నాయి. కానీ ఈ సంఘటన కాస్త భిన్నం.

అర్మేనియాలోని అరింజ్ గ్రామానికి చెందిన లెవోన్ అరకెల్యాన్ ప్రేమ కూడా దాదాపు అలాంటిదే. అందుకే చరిత్రలో నిలిచిపోయేలా తన ప్రేమను వ్యక్తపరిచాడు. ఇంతకీ లెవోన్ ఏం చేశాడో తెలుసా? ఆమెకు ఇష్టమైన వస్తువులు దాచుకోడానికి తన ఇంటి కింద చిన్న బేస్‌మెంట్ కట్టమని భార్య కోరింది. అంతే.. రోజూ కొంచెం కొంచెం తవ్వుతూ భూమి లోపల ఏకంగా చిన్న పాటి కోటనే కట్టేశాడు లెవోన్. దాన్ని అందమైన కళాఖండంగా తీర్చిదిద్దాడు. క్రమంగా లెవోన్ సృష్టించిన ఈ భూగర్భ కోట గురించి అందరికీ తెలిసిపోయింది. దీంతో తన భార్య కోసం కట్టుకున్న కోట పర్యాటక ప్రదేశంగా మారిపోయింది. వృత్తిరీత్యా ఆర్కిటెక్ట్ అయిన లెవోన్ 23 సంవత్సరాల పాటు శ్రమించి భూమిలోపల తవ్వి తన భార్యకు ఈ ప్రేమకోట కట్టాడు. దాదాపు 600 టన్నుల రాళ్లు, మట్టి తవ్వి పారేశాడు లేవోన్. కేవలం చేతి పనిముట్ల సాయంతో మాత్రమే చేశాడు. భార్య మీద భర్తకున్న ప్రేమను, దాన్ని వ్యక్తపరిచిన తీరును ఇప్పుడు అందరూ ప్రశంసిస్తున్నారు.

Related Stories: