బోటింగ్‌లో బోలెడంత మజా

తెలంగాణకే మకుటాయమానంగా నిలిచే నాగార్జునసాగర్‌కు నిత్యం సందర్శకుల తాకిడి కొనసాగుతూనే ఉంటుంది. ఈ రద్దీని దృష్టిలో పెట్టుకొని.. పర్యాటకులకు మరింత ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించేందుకు బోటింగ్ (పడవ ప్రయాణం)ను కూడా నిర్వహిస్తున్నారు అధికారులు. ఒక్క శుక్రవారం మినహా ప్రతిరోజూ నాగార్జునగిరి వరకు రెండు ట్రిప్పులు బోటు షికారు అందుబాటులో ఉంటుందక్కడ.

బోటింగ్ వేళలు:

ఉదయం తొమ్మిదిన్నరకు మొదటి ట్రిప్పు బోటింగ్ షికారు మొదలవుతుంది. రెండో ట్రిప్పు బోటింగ్ షికారు మధ్యాహ్నం ఒకటిన్నరకు ఉంటుంది. ఈ బోటు ప్రయాణానికి చార్జీలు పెద్దలకైతే 150 రూపాయలు, పిల్లలకైతే 120 రూపాయలు ఉంటాయి. డిమాండ్‌ను బట్టి శుక్రవారం మినహా ప్రతిరోజూ ఉదయం 11.30 గంటలకు కూడా ఒక ట్రిప్పును ప్లాన్ చేస్తున్నారు అధికారులు.

ప్రత్యేక టారిఫ్‌లు:

స్కూలు, కాలేజీల పిల్లల కోసం ప్రత్యేక టారిఫ్‌లు కూడా అందుబాటులో ఉన్నాయిక్కడ. ఏడువేల రూపాయలు చెల్లిస్తే 120 మంది కూర్చొనే నాన్ ఏసీ బోటును కేటాయిస్తారు. హాయిగా అందరూ కలిసి గంటపాటు విహరించవచ్చు. 8,500 చెల్లిస్తే ఏసీ బోటు అందుబాటులో ఉంటుంది.