బెల్లంతో సౌందర్యం!

సౌందర్యాన్ని పెంచుకునేందుకు మహిళలు పోటీపడుతున్నారు. ముఖారవిందాన్ని మరింత అందంగా మార్చుకునేందుకు కాస్సోటిక్స్ ప్రొడక్టులపై ఎక్కువగా ధనాన్ని వెచ్చిస్తున్నారు. అయితే, ఇంట్లో అందుబాటులో ఉండే బెల్లంతో ప్రకాశవంతమైన చర్మ సౌందర్యాన్ని పొందవచ్చు.

-రెండు చెంచాల బెల్లంపొడి, తేనె, కొద్దిగా నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకోవాలి. పది నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే చర్మకాంతి పెరుగుతుంది. -వారానికి మూడుసార్లు ఈ చిట్కాను పాటించడం వల్ల జుట్టు దృఢంగా మారుతుంది. -బెల్లం, ముల్తానీలో పోషకాలతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. -బెల్లం ప్రీ ర్యాడికల్స్ పై పోరాడి వయసు పెరిగినా, సౌందర్యంలో ఏమాత్రం మార్పు రాకుండా చేస్తుంది. -ముఖ్యంగా బెల్లంలో లభించే విటమిన్ సి, ఐరన్‌లు జుట్టు రాలే సమస్యను నిరోధిస్తాయి. -బెల్లంలో ఉండే ైగ్లెకోలిక్ యాసిడ్ చర్మకాంతిని పెంచేందుకు తోడ్పడుతుంది. -మొటిమలను రాకుండా కాపాడేందుకు బెల్లంలో ఉండే పోషకాలు ఉపయోగపడుతాయి.