బీహెచ్‌ఈఎల్‌లో

తిరుచిరాపల్లిలోని భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ (బీహెచ్‌ఈఎల్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ట్రేడ్ అప్రెంటిస్‌ల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
-పోస్టు పేరు: ట్రేడ్ అప్రెంటిస్ -మొత్తం ఖాళీలు: 529 -విభాగాల వారీగా ఖాళీలు: ఫిట్టర్-210, వెల్డర్-115, టర్నర్-28, మెషినిస్ట్-28, ఎలక్ట్రీషియన్-40, మోకానిక్ మోటా ర్ వెహికిల్ -15, డీజిల్ మెకానిక్-15, డ్రాఫ్ట్స్‌మ్యాన్ -15, ప్రోగ్రామింగ్ అండ్ సిస్టమ్స్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్-40, కార్పెంటర్-10, ప్లంబర్-10, ఎంఎల్‌టీ పాథాలజీ-3. -అర్హత: ఎనిమిది/పదోతరగతితోపాటు సంబంధిత ఐటీఐ ట్రేడ్‌లో ఉత్తీర్ణత. ఫిట్టర్/మెషినిస్ట్, ఎలక్ట్రీషియన్ ట్రేడ్‌లకు పదోతరగతి స్థాయిలో మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టులను చదివి ఉండాలి. ఎంఎల్‌టీ పాథాలజీ ట్రేడ్‌కు ఇంటర్ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ)లో ఉత్తీర్ణత. -ఎంపిక: అకడమిక్ మెరిట్ ఆధారంగా -దరఖాస్తు: ఆన్‌లైన్‌లో -చివరితేదీ: అక్టోబర్ 13 -వెబ్‌సైట్: www.bheltry.co.in