బీఎస్‌ఎఫ్‌లో 204 ఉద్యోగాలు

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్) నాన్ మినిస్టీరియల్ ఇంజినీరింగ్ (ఎలక్ట్రికల్) విభాగంలో ఖాళీగా ఉన్న జూనియర్ ఇంజినీర్/సబ్‌ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
-పోస్టు పేరు: జూనియర్ ఇంజినీర్/సబ్ ఇన్‌స్పెక్టర్ -మొత్తం పోస్టులు : 139 -సబ్ ఇన్‌స్పెక్టర్ (వర్క్స్)-103 ఖాళీలు (జనరల్-67, ఓబీసీ-23, ఎస్సీ-10, ఎస్టీ-3) -జూనియర్ ఇంజినీర్/సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎలక్ట్రికల్)-36 ఖాళీలు (జనరల్-27, ఓబీసీ-6, ఎస్సీ-1, ఎస్టీ-2) -అర్హత: ఎస్‌ఐ (వర్క్స్) పోస్టులకు సివిల్ ఇంజినీరింగ్‌లో మూడేండ్ల డిప్లొమా, జూనియర్ ఇంజినీర్/సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో మూడేండ్ల డిప్లొమా ఉత్తీర్ణత. సంస్థ నింబంధనల ప్రకారం శారీరక కొలతలు కలిగి ఉండాలి. -వయస్సు: 30 ఏండ్లకు మించరాదు. -పే స్కేల్: రూ. 35,400-1,12,400/- -ఎంపిక: రాతపరీక్ష, పీఎస్‌టీ, పీఈటీ టెస్ట్ ద్వారా -దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో -చివరితేదీ: ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ (సెప్టెంబర్ 1-7)లో వెలువడిన తేదీ నుంచి 30 రోజుల్లోగా దరఖాస్తులను పంపించాలి. ఇంజినీరింగ్ సెటప్ (ఎలక్ట్రికల్) విభాగంలో గ్రూప్ సీ పోస్టులు .. -ఖాళీలు - 65 -కానిస్టేబుల్ (జనరేటర్ మెకానిక్)- 30 ఖాళీలు -కానిస్టేబుల్ (లైన్‌మెన్)- 12 -కానిస్టేబుల్ (జనరేటర్ ఆపరేటర్)-23 -పేస్కేల్:రూ. 21,700-69,100/- -అర్హతలు: పదోతరగతితోపాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థలో సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికెట్, మూడేండ్ల అనుభవం ఉండాలి. -వయస్సు: 18 - 25 ఏండ్ల మధ్య ఉండాలి. -పరీక్ష ఫీజు: రూ. 100/- ఎస్సీ, ఎస్టీ, బీఎస్‌ఎఫ్ ఉద్యోగులకు, ఎక్స్‌సర్వీస్‌మెన్లకు ఫీజు మినహాయింపు ఉంటుంది. -దరఖాస్తు: వెబ్‌సైట్‌లో -చివరితేదీ: ప్రకటన విడులైన 30 రోజుల్లో పంపాలి. -వెబ్‌సైట్: www.bsf.nic.in