బాలింతలకు ఆహారం!

ఈనెల ప్రారంభంలోనే తల్లిపాల వారోత్సవాలు నిర్వహించి, బిడ్డ ఆరోగ్యానికి తల్లిపాలు ఎంత అవసరమో తెలుసుకున్నాం. మరీ.. తల్లికి పాలు ఉత్పత్తి అవ్వాలంటే.. సరైన పోషకాలు, విటమిన్లు కలిగిన ఆహారం కచ్చితంగా తీసుకోవాల్సిందే. ప్రసవం మొదటి మూడు నెలలు తల్లి తీసుకునే ఆహారంపైనే పిల్లల ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ఈ వారం బాలింతలు తీసుకొనే ఆహారం గురించి తెలుసుకుందాం.

-నవజాత శిశువుల ఆరోగ్యం మెరుగుపడడానికి, రోగనిరోధక శక్తి పెరుగడానికి తల్లిపాలు ఎంతో అవసరం. అందుకే ప్రసవం అయిన ఆరు నెలల వరకూ బిడ్డకు తల్లిపాలే అందించాలి. -అందుకే తల్లులు ఐరన్, విటమిన్లు, ప్రొటీన్ ఉన్న ఆహారం ఎక్కువగా తీసుకోవాలి. -బాలింతలు తృణధాన్యాలు, పప్పు దినుసులు, డ్రై ఫ్రూట్స్, తాజా పండ్లు, కూరగాయలు, గుడ్లు, చికెన్ వంటి ప్రొటీన్స్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. -బాలింతలు ఆల్కహాల్‌కు దూరంగా ఉండాలి. దానికి బదులుగా తాజా పండ్ల రసాలు తీసుకోవడం ఉత్తమం. విటమిన్ సి, జింక్ అధికంగా ఉండే పండ్లను రోజూ తీసుకోవచ్చు. -దానితో పాటుగా కొబ్బరి, లస్సీ, నిమ్మరసం, ఉడకబెట్టిన దుంపలు, గుడ్లు, కూరగాయలు వంటివి ఆహారంలో భాగం చేసుకోవాలి. -ప్రసవం తర్వాత మొదటి మూడు నెలలు కాల్షియం ఉన్న పదార్థాలు తీసుకోవడం చాలా మంచిది. -వోట్స్‌ను నిత్యం ఆహారంతో తీసుకుంటే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. కొవ్వును తగ్గించి పాల ఉత్పత్తికి దోహదం అవుతుంది. -ప్రతిరోజూ కూరల్లో వెల్లుల్లి ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. బాలింతలకు వెల్లుల్లి ఎంతో మేలు చేస్తుంది. తల్లికి పాల ఉత్పత్తి నుంచి సరఫరా వరకూ వెల్లుల్లి కీలకపాత్ర పోషిస్తుంది.

Related Stories: