బాలా త్రిపురసుందరి

హ్రీంకారాసన గర్భితానల శిఖాం సౌఃక్లీం కళాంబిభ్రతీం సౌవర్ణాంబర ధారిణీం వరసుధాదౌతాం త్రినేత్రోజ్జలాం వందే పుస్తక పాశాంకుశధరామ్ స్రగ్భూషితాముజ్జలాం తాంగౌరీం త్రిపురాం పరస్పర కళాం శ్రీచక్ర సంచారిణీం!! balaambika శ్రీ శక్తి కౌమార స్వరూపం బాలం. అమ్మవారు త్రిగుణైక శక్తి. ఆనందప్రదాయిని. బాల్యంలో ఉన్న నిర్మలత్వానికి ప్రతీక. త్రిపురసుందరి అనుగ్రహం కోసం దేవి ఉపాసకులు ముందుగా బాలార్చన చేస్తారు. అభయ హస్తం, అక్షమాల ధరించిన బాలా రూపాన్ని ధరిస్తే మనోవికారాలు తొలిగిపోతాయి. ఈ రోజున పదేండ్ల లోపు అమ్మాయిలకు భోజనం పెట్టి అమ్మవారి స్వరూపాలుగా కొలువడం ఈ అవతారం విశిష్టత. ఈ రోజు అమ్మవారికి నైవేద్యంగా పాయసాన్ని పెడుతారు.
× RELATED లక్ష్యం పెద్దది.. లక్షలే అడ్డంకి..