ఫైర్‌ఫాక్స్ కొత్తలోగో!

నెట్ బ్రౌజింగ్‌లో తనదైన ముద్ర వేసిన మొజిల్లా ఫైర్‌ఫాక్స్ లోగో మారుతున్నదా? తన వినియోగదారులను ఆకట్టుకునేందుకు, ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్లుగా కొత్త కళను సంతరించుకుంటున్నదా? అంటే అవుననే సమాచారం వస్తున్నది. గూగుల్‌కు పోటీగా ఉన్న మరో బ్రౌజర్ మొజిల్లా ఫైర్‌ఫాక్స్. గతంలో ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవ్వకపోవడంతో పోటీలో నిలబడలేకపోయింది. దీంతో తన వినియోగదారులను ఆకట్టుకునేందుకు, కొత్తగా లోగో మార్చి పోటీకి సిద్ధమైంది ఫైర్‌ఫాక్స్. కంపెనీ తయారు చేసిన రెండు కొత్త లోగోలను కంపెనీ బ్లాగ్‌లో పోస్ట్ చేసింది. వాటిపై వినియోగదారుల అభిప్రాయాలను తెలియజేయాలని కోరుతున్నది ఫైర్‌ఫాక్స్. ఇందుకు తన బ్రాండింగ్ సాఫ్ట్‌వేర్లు, సేవలన్నింటికీ లోగోలను మార్చివేసింది. గతంలో గ్లోబ్‌ను చుట్టువుండే నక్క లోగో ఉండేది. ఆ పాత లోగోకు స్వస్తి పలికి ఈ రెండు కొత్త లోగోలను రూపొందించింది. వీటిల్లో ఒకటి బాణం గుర్తుతో ఉండగా, మరొకటి నక్క తోక గుడ్రంగా చుట్టి ఉండేలా తయారు చేశారు. వీటిల్లో ఏది బాగుంటుందో? ఇంకా ఎలాంటి రూపకల్పన చేయాలో చెబితే.. ఎక్కువమంది అభిప్రాయాన్ని ఆధారంగా చేసుకొని లోగోను మార్చేస్తామని చెబుతున్నారు ఫైర్‌ఫాక్స్ ప్రతినిధులు. మీరు కూడా ఏమైనా మార్పులు చెప్పదల్చుకుంటే కంపెనీ వెబ్‌సైట్‌లో మీ అభిప్రాయాలు వెల్లడించవచ్చు.

Related Stories: