దొరసాని ప్రణయగాథ

1980దశకం నాటి తెలంగాణ నేపథ్యంలో రూపొందుతున్న ప్రేమకథా చిత్రం దొరసాని. ఈ చిత్రం ద్వారా విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ కథానాయకుడిగా పరిచయమవుతున్నాడు. సీనియర్ హీరో రాజశేఖర్ కుమార్తె శివాత్మిక నాయికగా అరంగేట్రం చేస్తున్నది. మహేంద్ర దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్నది. 1980దశకం నాటి తెలంగాణ జనజీవన పరిస్థితులకు అద్దంపడుతూ భూస్వామ్య వ్యవస్థ నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ప్రేమకథా చిత్రమిదని సమాచారం.

ప్రస్తుతం నల్గొండ జిల్లాలో చిత్రీకరణ జరుగుతున్నట్లు తెలిసింది. అచ్చ తెలంగాణ మాండలికంలో ఆనాటి తెలంగాణ జీవనాన్ని ప్రతిబింబించే చిత్రమిదని తెలుస్తున్నది. విస్త్రృత పరిశోధనతో యథార్థ సంఘటనల ఆధారంగా దర్శకుడు ఈ చిత్రానికి రూపకల్పన చేస్తున్నారని సమాచారం.