సందేశంతో రూల్

శివ, సోనా పటేల్ జంటగా నటిస్తున్న చిత్రం రూల్. ది పవర్ ఆఫ్ పీపుల్ ఉపశీర్షిక. పైడి రమేష్ దర్శకత్వంలో పైడి సూర్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్ర మోషన్ పోస్టర్‌ను ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ఓ యువజన నాయకుడి కథ ఇది. తన కుటుంబంతోపాటు ఇతర కుటుంబాలను అతను ఎలా ఆదుకున్నాడు? చివరికి అందరికి ఎలా ఆదర్శవంతుడిగా నిలిచాడన్నదే ఈ చిత్ర ప్రధాన ఇతవృత్తం. హైదరాబాద్, వైజాగ్, అరకు పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించాం అన్నారు. నిర్మాత మాట్లాడుతూ ఆవేశం కంటే ఆలోచన ముఖ్యమని, మనీ కంటే మనుషులు ముఖ్యమని తెలియజేసే చిత్రమిది. ఫస్ట కాపీ సిద్ధమైంది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసి చిత్రాన్ని నవంబర్ 9న విడుదల చేస్తున్నాం అన్నారు.