రంజాన్ సందర్భంగా రేపు ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్ : రంజాన్ పర్వదినం సందర్భంగా హైదరాబాద్‌లో పలుచోట్ల గురువారం ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. పాతబస్తీ, మీరాలం ఈద్గా పరిసరాల్లో ఉదయం 8 గంటల నుంచి 11.30 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. పురానాపూల్, కామాటిపురా, కిషన్‌బాగ్, బహదూర్‌పురా ప్రాంతాల్లో ఆంక్షలు ఉండనున్నాయి. శివరాంపల్లి, ఎన్‌పీఏ నుంచి వచ్చే వాహనాలను బహదరూర్‌పురా వద్ద దారి మళ్లించనున్నారు. మసీదులు ఉండే ప్రాంతాల్లో వాహనాలకు అనుమతి లేదు. వేరే ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని పోలీసులు సూచించారు.
× RELATED యువకుడి దారుణహత్య.. ప్రేమవ్యవహారం బయటపెట్టడమే కారణమా?